నేరం చేసి జైలుకి.. అక్కడే ఉద్యోగ విరమణ

కోపరేటివ్‌ సొసైటీలో కార్యదర్శిగా ఉంటూ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కాజేసిన కేసులో అరెస్టయి జైల్లోనే పదవీ విరమణ చేశారు.

Published : 01 Aug 2023 05:04 IST

నిధుల గోల్‌మాల్‌ కేసులో అరెస్టైన ఓ ఎక్సైజ్‌ ఉద్యోగి గాథ

ఈనాడు, అమరావతి: కోపరేటివ్‌ సొసైటీలో కార్యదర్శిగా ఉంటూ ఉద్యోగులు దాచుకున్న డబ్బులను కాజేసిన కేసులో అరెస్టయి జైల్లోనే పదవీ విరమణ చేశారు. విజయవాడలోని సెంట్రల్‌ ఎక్సైజ్‌ స్టాఫ్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌లో జె.ఎస్‌.చక్రవర్తి కార్యదర్శిగా ఉండేవారు. రూ.6.34 కోట్ల నిధులను గోల్‌మాల్‌ చేశారని మూడేళ్ల కిందట విజయవాడలో కేసు నమోదైంది. అయినప్పటికీ.. పోలీసులు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అధికారులు చక్రవర్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎట్టకేలకు ఈ ఏడాది జులై 17న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. దీంతో అతడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ప్రస్తుతం విజయవాడలోని సబ్‌జైలులోనే ఉన్న నిందితుడు.. జైలులోనే సోమవారం పదవీ విరమణ చేశారు. చక్రవర్తి తొలుత చిన్నస్థాయి ఉద్యోగిగా చేరి ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి ఎదిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని