Bhimavaram: పొరపాటున జగన్‌ రావాలని కోరుకున్నా.. చెప్పుతో కొట్టుకున్న సర్పంచి

‘ఏపీని బాగు చేస్తారనుకుని.. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని 10 సంవత్సరాల పాటు భార్యా పిల్లలను, వ్యాపారాలను వదులుకుని కష్టపడ్డాను.

Updated : 11 Aug 2023 11:06 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘ఏపీని బాగు చేస్తారనుకుని.. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని 10 సంవత్సరాల పాటు భార్యా పిల్లలను, వ్యాపారాలను వదులుకుని కష్టపడ్డాను. ఆయనకు బెయిల్‌ రావాలంటూ మేరీ మాత మందిరానికి వెళ్లి మొక్కుకుని బెయిల్‌ వచ్చాక మొక్కులు తీర్చుకున్నా. గ్రామాల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా జగన్‌ పేరున చేశాను. అలాంటి తప్పు చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా’ అంటూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల సర్పంచుల ఛాంబర్‌ అధ్యక్షుడు, ఆరుగొలను సర్పంచి పీతల బుచ్చిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాలో తనకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపాల మద్దతుతో గెలిచానన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నందుకు నిరసనగా భాజపా, జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించారు. ఈ సమయంలో బుచ్చిబాబు మాట్లాడుతూ చెప్పుతో కొట్టుకుంటుండగా జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భాజపా రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్‌బాజీ తదితరులు అడ్డుకున్నప్పటికీ ‘నేను చేసిన తప్పును దేవుడు కూడా క్షమించడు.. చాలా పెద్ద తప్పు చేశాను ప్రజలను క్షమాపణ కోరుతున్నా’నంటూ బుచ్చిబాబు ఆవేదన చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు