చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం

చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు.

Published : 29 Apr 2024 03:05 IST

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. ఆదివారం రాష్ట్ర కర్మాగారాల శాఖ, జాతీయ భద్రతా మండలి(ఎన్‌ఎస్‌సీ) తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ‘ప్రపంచ పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య దినోత్సవం’ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇటీవల నందిగామలో వెల్డింగ్‌ చేస్తుండగా వచ్చిన నిప్పురవ్వల కారణంగా ఓ కర్మాగారం మొత్తం కాలిపోయింది. కర్మాగారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. దీని కోసం నేడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి’ అని సూచించారు. ఎన్‌ఎస్‌సీ తెలంగాణ చాప్టర్‌ ఛైర్మన్‌, కర్మాగారాల శాఖ డైరెక్టర్‌ రాజగోపాల్‌రావు, న్యూలాండ్‌ లాబోరేటరీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ దవులూరి సుచేత్‌రావు, జాయింట్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వై.మోహన్‌బాబు పాల్గొన్నారు. అంతకుముందు కార్మికులు, ఉద్యోగులు లఘునాటికలు ప్రదర్శించారు. విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని