నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్‌ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు.

Published : 29 Apr 2024 03:05 IST

నందిగామ, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్‌ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ గ్లోబల్‌గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌(దాజీ) ఆధ్వర్యంలో రెండు బ్యాచులుగా మే 6 వరకు వీటిని నిర్వహించనున్నట్లు వివరించారు. మొదటి బ్యాచ్‌ ఏప్రిల్‌ 29 నుంచి మే 1 వరకు, రెండో బ్యాచ్‌ మే 4 నుంచి 6 వరకు నిర్వహిస్తామని అన్నారు. సోమవారం నాటి ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని