తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!

సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 29 Apr 2024 03:16 IST

న్యూస్‌టుడే, నెల్లికుదురు: సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాంతండా ఈ వేడుకకు వేదికైంది. తండాకు చెందిన 86 ఏళ్ల గుగులోత్‌ సమిడానాయక్‌, 80 సంవత్సరాల గుగులోత్‌ లాలమ్మలు సుమారు 67 ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి కుమారులు మంగీలాల్‌, హరిలాల్‌, నర్సయ్య, చందూలాల్‌, కుమార్తె సాయమ్మ సంతానం. వీరిలో నర్సయ్య, చందూలాల్‌ మరణించారు. కుటుంబం కోసం ఇన్నేళ్లుగా శ్రమించిన తాత, నానమ్మలకు పెళ్లి జరిపించాలని చందూలాల్‌ కుమారుడు యాకుబ్‌ భావించాడు. తన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడంతోపాటు..పెద్దమ్మలు, పెదనాన్నలు, అన్నలనూ సంప్రదించాడు. అందరి అంగీకారంతో ముహూర్తం నిర్ణయించారు. మనవళ్లు పెళ్లి బాధ్యతలను తలకెత్తుకున్నారు. బంధువులు, తండావాసులను ఆహ్వానించారు. పురోహితుల సమక్షంలో వేదమంత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా ఆదివారం ఇద్దరికీ వివాహం జరిపించారు. మనవళ్లు చేసిన ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు ఊరి జనం తరలివచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని