వరి పొలంలో భారీ మొసలి పట్టివేత

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్‌లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్‌కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది.

Published : 29 Apr 2024 03:08 IST

న్యూస్‌టుడే, కొత్తకోట గ్రామీణం: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్‌లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్‌కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. భయంతో ఆయన గ్రామంలోకి పరిగెత్తి స్థానికులకు విషయం తెలియజేశారు. వారు స్నేక్‌ సొసైటీ నిర్వాహకుడు, హోంగార్డు కృష్ణసాగర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన తన బృందంతో చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మొసలిని బంధించారు. ఆరు అడుగుల పొడవు, 185 కిలోల బరువు ఉందని ఆయన తెలిపారు. బంధించిన మొసలిని జూరాల జలాశయంలో విడిచిపెడతామన్నారు. సమీపంలోని చెరువు నుంచి  మొసలి వచ్చిందని, ఇటీవల ఓ ఆవుదూడ, మేకలను చంపి తిందని గ్రామస్థులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని