సాహస బాలుడు సాయిచరణ్‌కు ముఖ్యమంత్రి అభినందన

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్‌ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు.

Published : 29 Apr 2024 03:09 IST

న్యూస్‌టుడే, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్‌ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. షాద్‌నగర్‌ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్‌ ఆదివారం సాయిచరణ్‌, తల్లిదండ్రులు వెంకటేశ్‌, రేణుకలను హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి తీసుకెళ్లి పరిచయం చేశారు. సాయిచరణ్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలకు తెగించి ఐదుగురిని కాపాడిన తీరును సీఎం మెచ్చుకున్నారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. చిత్రంలో సాయిచరణ్‌ తల్లిదండ్రులతో పాటు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని