టెట్‌ సమస్యకు త్వరలో పరిష్కారం

ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్‌ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు.

Published : 03 May 2024 05:00 IST

ఎన్‌సీటీఈ మెంబర్‌ సెక్రటరీతో పీఆర్‌టీయూటీఎస్‌ నేతల భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్‌ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పీఆర్టీయూటీఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. టెట్‌ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) మెంబర్‌ సెక్రటరీ కేసంగ్‌ యాంగ్జోమ్‌ షెర్పాను కోరగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. గురువారం పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు.. కేసంగ్‌ను దిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతికి టెట్‌ ఉతీర్ణత తప్పనిసరి అయినందున ముందుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ అనంతరం టెట్‌ అర్హత పొందేందుకు ఐదు సంవత్సరాల వరకు గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇస్తామని కేసంగ్‌ హామీ ఇచ్చినట్లు పీఆర్‌టీయూటీఎస్‌ నేతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని