astronauts: భూమికి సురక్షితంగా చేరిన నలుగురు వ్యోమగాములు..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరు నెలలపాటు పరిశోధనలు చేసిన వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరుకొన్నారు. వీరు ప్రయాణించిన క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌ సురక్షితంగా ఫ్లోరెడా వద్ద సముద్రంలో పడింది.  

Published : 04 Sep 2023 15:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఆరు నెలల అంతరిక్ష యాత్రను ముగించుకొని నలుగురు వ్యోమగాములు సురక్షితంగా స్ప్లాష్‌ డౌన్‌ విధానంలో ఫ్లోరెడా తీరంలోని సముద్ర జలాల్లో దిగారు. ఇందుకోసం స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌ను వినియోగించారు. నాసా-స్పేస్‌ ఎక్స్‌ సంయుక్తంగా నిర్వహించిన క్రూ-6 మిషన్‌లో వీరు పనిచేశారు. 

వీరు స్పేస్‌ స్టేషన్‌ నుంచి 13 అడుగుల వెడల్పైన క్రూడ్రాగన్‌ వెహికల్‌లోకి ఆదివారం ప్రవేశించారు. దాదాపు ఒక రోజు భూకక్ష్యలో తిరిగి ఫ్లొరెడాలోని జాక్సన్‌విల్లే సముద్ర తీరం వద్ద ల్యాండ్‌ సైట్‌ సమీపంలోకి చేరుకొన్నారు. అర్ధరాత్రి తర్వాత వారి క్యాప్సుల్‌ సముద్రజలాలపై దిగింది. ఈ ప్రయాణంలో క్రూడ్రాగన్‌ క్యాప్సుల్‌ ఒక దశలో గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించిన  తర్వాత దాదాపు 1,900 డిగ్రీల వద్దకు దీని బాహ్య ఉష్ణోగ్రత చేరుకొంది. అనంతరం దీనికి అమర్చిన ప్యారాచూట్లు విచ్చుకోవడంతో వేగం నెమ్మదించి మెల్లగా సముద్రంలో పడింది. దీనిని డ్రాగన్స్‌ నెస్ట్‌ అనే ప్రత్యేకమైన బోట్‌లోకి ఎక్కించారు. అక్కడే వ్యోమగాములకు అన్ని పరీక్షలు నిర్వహించారు.  

మరోసారి సురక్షితంగా ల్యాండ్‌ అయిన విక్రమ్‌.. ఇస్రో ట్వీట్

తాజాగా నేలపైకి చేరిl వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు ఉన్నారు. వీరితో పాటు రష్యాకు కాస్మోనాట్‌ ఆండ్రీఫెడ్యావ్‌, యూఏఈకి చెందిన రెండో ఆస్ట్రోనాట్‌ సుల్తాన్‌ అల్నేయాడి కూడా ఉన్నారు. ఈ బృందం మార్చి నుంచి ఆరు నెలల పాటు అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌లో పరిశోధనలు నిర్వహించింది. అనంతరం క్రూ-3 బృందం ఆగస్టు 27న అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌కు చేరుకొంది. దీంతో అక్కడి పరిశోధనలను వారికి అప్పగించి వీరు తిరుగుముఖం పట్టారు. వీరు తమ ఆరు నెలల కాలంలో దాదాపు 200కు పైగా సైన్స్‌ అండ్‌ టెక్‌ ప్రాజెక్టులను చేపట్టారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని