Britain: బ్రిటన్‌ రెండో అతిపెద్ద నగర పాలక సంస్థ దివాలా..!

ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ అయిన బర్మింగ్‌ హామ్‌ సిటీ కౌన్సిల్‌ దివాలా నోటీసు దాఖలు చేసింది. ఇది బ్రిటన్‌లో రెండో అతిపెద్ద నగరం.

Updated : 06 Sep 2023 11:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్‌ (Britain) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మంగళవారం బ్రిటన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ (Birmingham city council) దివాలా తీసినట్లు ప్రకటించింది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్‌ డాలర్లు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు దివాలా తీయడంతో..  అత్యవసరం కాని అన్ని ఖర్చులను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఈ నగరం సమాన వేతన క్లెయిమ్‌లు దాదాపు 956 మిలియన్‌ డాలర్లకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. దాదాపు 10 లక్షల మందికి సేవలు అందించే బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ మంగళవారం సెక్షన్‌ 114 నోటీస్‌ను ఫైల్‌ చేసింది. లోకల్‌ గవర్నమెంట్‌ అసోసియేషన్‌ అదనపు సాయం అందించాలని సిటీ కౌన్సిలర్లు జాన్‌ కాటన్‌, షెరెన్‌ థాంప్సన్‌లు కోరారు. 2023-24కు దాదాపు 109 మిలియన్‌ డాలర్లు అవసరం దీనికి ఉంది. తమకు అందాల్సిన 1.25 బిలియన్‌ డాలర్ల నిధులను కన్జర్వేటివ్‌ ప్రభుత్వం లాక్కోందని థాంప్సన్‌ ఆరోపించారు. 

ఐటీ సిస్టమ్‌లో సమస్యలు కూడా బర్మింగ్‌హామ్‌ సిటీ కౌన్సిల్‌ ఆర్థిక దుస్థితిని మరింత ఎగదోశాయి. మే నెలలో ఒరాకిల్‌ ఈపీఆర్‌ సిస్టమ్‌కు 100 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. తొలుత అంచనా వేసిన దాని కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు అదనం.

జీ-20 సదస్సుకు.. వచ్చేదెవరు? రానిదెవరు?

పరిస్థితిపై బ్రిటన్‌ ప్రధాని కార్యాలయమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ స్పందించింది. తమకు అక్కడి ఆర్థిక సమస్యలు తెలుసని పేర్కొంది. అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా తాము సాయం అందిస్తామని ప్రధాని అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాలు కూడా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని