Viral Video: చైనాలో టోర్నడో విధ్వంసం.. వీడియో వైరల్‌

చైనాలో ఓ టోర్నడో విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. 

Updated : 21 Sep 2023 06:10 IST

చైనా: చైనా(China)లో ఓ టోర్నడో(Tornado) బీభత్సం సృష్టించింది. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసానికి 10 మంది చనిపోగా, పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. స్థానిక మీడియా తెలిపిన ప్రకారం జియాంగ్స్‌ ప్రావిన్స్‌లోని సుకియాన్‌ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. మెల్లగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. దీంతో భారీ శబ్దంతో పాటు వీచిన గాలికి ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరి పరిస్థితి భయానకంగా మారింది. 

ఈ సుడిగాలి ధాటికి 137 ఇళ్లు నేలమట్టం కాగా, 5,500 మంది ప్రజలు తీవ్ర ప్రభావితమయ్యారు. 400 మంది వారి నివాసాలను ఖాళీ చేసి వెళ్లారు. టోర్నడో విధ్వంసం అనంతరం వాహనాలు ఎక్కడికక్కడ చెల్లచెదురుగా పడ్డాయి. పలు ఇళ్లు రూపురేఖలు మారాయి. సుడిగాలి ధాటికి ఇళ్ల శకలాలు, ఇతర వస్తువులు మీదపడడంతో పలువురు రోడ్లపైనే విగతజీవులుగా మారారు. ఈ విధ్వంసానికి సంబంధించిన పలు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని