నైగర్‌లో ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయానికి నిప్పు

నైగర్‌లోని సైనిక ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని నియామిలో ఆదివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యా పతాకాలు చేతబట్టి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరును నినదించారు.

Published : 31 Jul 2023 03:58 IST

సైనిక ప్రభుత్వ మద్దతుదారుల దుశ్చర్య

నియామి: నైగర్‌లోని సైనిక ప్రభుత్వ మద్దతుదారులు రాజధాని నియామిలో ఆదివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రష్యా పతాకాలు చేతబట్టి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరును నినదించారు. తమను చాలా కాలం పరిపాలించిన ఫ్రాన్స్‌ను నిందించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్‌ రాయబార కార్యాలయం మీదుగా వెళ్తు వారు దాని తలుపునకు నిప్పంటించారు. ఆ సమయంలో కార్యాలయంలో ఒకరు ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఆందోళనకారుల ఆగడాలతో మరోపక్క నగరం నలుమూలలా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. నైగర్‌ సైన్యం వారిని చెదరగొట్టింది. తమ రాయబార కార్యాలయం, తమ దేశ ప్రయోజనాలపై దాడులను ఉపేక్షించబోమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ పౌరులు, సైన్యం, రాయబారులు, ఫ్రెంచ్‌ అధికారులపై ఎవరైనా దాడికి పాల్పడితే తక్షణం వారు మా ప్రతిస్పందనను చవిచూస్తారని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని