Cardiovascular Diseases: హృద్రోగ ముప్పును.. పుక్కిలింతతో పసిగట్టొచ్చు!

గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

Updated : 19 Aug 2023 08:08 IST

ఒట్టావా: గుండె-రక్తనాళాల సంబంధిత వ్యాధుల(Cardiovascular diseases) ముప్పును కేవలం లాలాజల నమూనా పరీక్షతో ముందుగానే పసిగట్టగల సరికొత్త విధానాన్ని కెనడాలోని మౌంట్‌ రాయల్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సాధారణంగా చిగుళ్ల ఇన్‌ఫ్లమేషన్‌ వల్ల పీరియడాంటైటిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దాని బాధితుల్లో ఇన్‌ఫ్లమేటరీ కారకాలు చిగుళ్ల ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి.. రక్తనాళ వ్యవస్థకు హాని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో- లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులను గుర్తించడం ద్వారా హృదయం-రక్తనాళాల సంబంధిత వ్యాధుల రాక ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో గుర్తించారు. పలువురు వ్యక్తులను సెలైన్‌తో పుక్కిలించేలా చేసి.. తద్వారా సేకరించిన లాలాజల నమూనాలను వారు విశ్లేషించారు. లాలాజలంలో తెల్ల రక్తకణాల స్థాయులు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో.. రక్తనాళాలు బిరుసుగా మారుతున్నాయని, రక్తప్రవాహానికి అనుగుణంగా వ్యాకోచించే సామర్థ్యం వాటికి తక్కువగా ఉంటోందని నిర్ధారించారు. అలాంటి వ్యక్తుల్లో హృద్రోగాల ముప్పు పెరుగుతోందని తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని