ప్రపంచంలోనే పొడవైన కురులు ఆమె సొంతం

అమెరికాకు చెందిన 58 ఏళ్ల మహిళ తామి మానిస్‌ ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.

Published : 04 Sep 2023 04:42 IST

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన 58 ఏళ్ల మహిళ తామి మానిస్‌ ప్రపంచంలోనే అతి పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. నాక్స్‌ విల్లేకు చెందిన ఈమెకు 172.72 సెం.మీ (5.8 అడుగుల) పొడవైన జుట్టు ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. టెన్నెసే రాష్ట్రంలోని నాక్స్‌విల్లేకు చెందిన మానిస్‌ ప్రభుత్వ నర్సుగా పని చేస్తున్నారు. అమెరికన్‌ రాక్‌బ్యాండ్‌లో ఓ వీడియో చూసి ప్రేరణ పొందిన ఆమె.. 1980 నుంచి తన  జుట్టును ఒక్కసారి కూడా కత్తిరించుకోలేదట. తల ముందు భాగాన్ని మాత్రం హెయిర్‌ స్టయిల్‌ చేయిస్తూ.. వెనుక వైపు పొడవుగా పెంచారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కురుల సంరక్షణకు హస్క్‌ హెయిర్‌ ఉత్పత్తులను వాడినట్లు మానిస్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని