మా మేడ్‌ ఇన్‌ చైనా కారును చూడండి

చైనా అధినేత జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశమైనప్పుడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.

Updated : 18 Nov 2023 05:39 IST

బైడెన్‌తో జిన్‌పింగ్‌ ఆసక్తికర సంభాషణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా అధినేత జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశమైనప్పుడు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. సమావేశం అనంతరం జిన్‌పింగ్‌కు వీడ్కోలు పలికేందుకు బైడెన్‌ ఆయన కారు వద్ద వరకూ వెళ్లారు. చైనా అధినేత వినియోగిస్తున్న శత్రు దుర్భేద్య కారు హాంగ్‌కీ ఎన్‌701 లిమోను చూసిన బైడెన్‌ ‘చాలా అందంగా ఉంది’ అని చెప్పారు. దీనికి జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. ‘ఇది మేడ్‌ ఇన్‌ చైనా సెడాన్‌. డోర్‌ తీసి అధ్యక్షుడికి మన కారును చూపించండి’ అని తన సిబ్బందికి సూచించారు. జిన్‌పింగ్‌ కారును పరిశీలించిన అనంతరం బైడెన్‌ తన వాహనం గురించి చైనా అధ్యక్షుడికి చెప్పారు. ‘‘మాది క్యాడిలాక్‌ కార్‌. కదిలే బంకర్‌లా దాన్ని రూపొందించారు. ‘ది బీస్ట్‌’ అంటారు’’ అని తన వాహనం గురించి గర్వంగా చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అవి వైరల్‌గా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని