కెనడా ఆలయాల్లో చోరీలు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు

కెనడాలోని హిందూ దేవాలయాల్లో పలుమార్లు చోరీలకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు.

Updated : 30 Dec 2023 06:05 IST

టొరంటో: కెనడాలోని హిందూ దేవాలయాల్లో పలుమార్లు చోరీలకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడిని జగదీశ్‌ పంధేర్‌(41)గా గుర్తించినట్లు గ్రేటర్‌ టొరంటో పోలీసులు గురువారం ప్రకటించారు. ఇతను అక్టోబరు 8 తెల్లవారుజామున పికరింగ్‌లోని బెయిలీ స్ట్రీట్‌, క్రోస్నో బౌల్‌వార్డ్‌లలోని ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. ఆలయాల్లోని హుండీల్లో భారీగా నగదు దోచుకున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో కనిపించాయని వెల్లడించారు. ఈ ఏడాదిలో నమోదైన ఇతర ఆలయాల దోపిడీల్లోనూ నిందితుడి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నామన్నారు. ఆలయాల్లో చొరబడటం, చోరీలకు పాల్పడడం.. ఇలా నాలుగు రకాల అభియోగాల్ని పంధేర్‌పై నమోదుచేసినట్లు పోలీసులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు