చలిగా ఉంది.. ఎన్నికలు వద్దు: పాక్‌ సెనెట్‌ వింత తీర్మానం

దేశంలో అతిశీతల వాతావరణంతో పాటు భద్రతా సమస్యలు ఏర్పడినందున ఫిబ్రవరి 8న జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలను వాయిదా వేయాలన్న తీర్మానాన్ని పాకిస్థాన్‌ ఎగువ సభ సెనెట్‌ శుక్రవారం ఆమోదించింది.

Published : 06 Jan 2024 06:22 IST

ఇస్లామాబాద్‌: దేశంలో అతిశీతల వాతావరణంతో పాటు భద్రతా సమస్యలు ఏర్పడినందున ఫిబ్రవరి 8న జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలను వాయిదా వేయాలన్న తీర్మానాన్ని పాకిస్థాన్‌ ఎగువ సభ సెనెట్‌ శుక్రవారం ఆమోదించింది. 100 మంది సభ్యులు గల సెనెట్‌లో కేవలం 14 మంది మాత్రమే ఓటింగ్‌కు హాజరై స్వతంత్ర సెనెటర్‌ దిలావర్‌ ఖాన్‌ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని ఆమోదించారు. ఇది రాజ్యాంగ విరుద్ధ తీర్మానమని పాలక పార్టీ పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (నవాజ్‌)తో పాటు ప్రతిపక్షాలు పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ- ఇన్సాఫ్‌(పీటీఐ), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ)లు కూడా వ్యతిరేకించాయి. పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం కూడా సెనెట్‌ తీర్మానాన్ని వ్యతిరేకించి, పార్లమెంటు ఎన్నికలు ముందనుకున్న ప్రకారం ఫిబ్రవరి 8నే జరుగుతాయని స్పష్టం చేసింది. సరిగ్గా ఈ తేదీనాడే ఎన్నికలు జరపాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించినా, సెనెట్‌ ఎన్నికల వాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. సుప్రీం ఆదేశం లేకుండా ఎన్నికల తేదీలను మార్చే ప్రసక్తి లేదని పాక్‌ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని