సహాయం కోసం వేచి ఉన్నవారిపై దాడి

గాజా సిటీలో మానవతా సాయం కోసం వేచి ఉన్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 20 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు.

Published : 26 Jan 2024 05:21 IST

గాజా సిటీలో 20 మంది మృతి
బాధితుల శిబిరంపై దాడిలో మరో 12 మంది

జెరూసలెం, బీరుట్‌: గాజా సిటీలో మానవతా సాయం కోసం వేచి ఉన్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడిలో 20 మంది మరణించారు. 150 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మరోవైపు ఖాన్‌యూనిస్‌లో కిక్కిరిసి ఉన్న బాధితుల శిబిరంపై బుధవారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 12 మంది మృతి చెందారు. 75 మంది గాయపడ్డారు. రెండు ట్యాంకులతో ఈ దాడి జరిగిందని ఐరాస సహాయక సంస్థ వెల్లడించింది. అయితే ఈ దాడిని తాము చేయలేదని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కానీ ట్యాంకులు ఇజ్రాయెల్‌వద్దే ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. బుధవారం రాత్రి ఖాన్‌యూనిస్‌లోని ఓ ఆసుపత్రిని శరణార్థులు ఖాళీ చేశారు. వందల మంది రోగులు, వేల మంది నిరాశ్రయులు ఆసుపత్రిని వదిలివెళ్లారు.

కాల్పుల్లో అమెరికా యువకుడి మృతి

పాలస్తీనా సంతతికి చెందిన అమెరికా యువకుడు తౌఫిక్‌ అబ్దుల్‌ జబ్బార్‌ (17) ఇజ్రాయెల్‌ కాల్పుల్లో మరణించాడు. వెస్ట్‌బ్యాంకులోని యాష్‌-షర్కియాలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కులో వెళ్తున్న తౌఫిక్‌పై ఎటువంటి కవ్వింపు లేకుండానే ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపారని, ట్రక్కు దిగి పారిపోయేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని అతడి స్నేహితుడు సలామే తెలిపాడు. అయితే రాళ్లు విసిరినందుకే కాల్పులు జరిపామని ఇజ్రాయెల్‌ అంటోంది. దీనిని సలామే గురువారం ఖండించాడు. ఒకవేళ తాము రాళ్లు విసిరితే అరెస్టుకు అవకాశముందని, కానీ చేయలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని