భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్‌ ఎదిగేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్‌-భూటాన్‌ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ-తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత శనివారం వెలువడిన ఉమ్మడి ప్రకటన తెలిపింది.

Updated : 17 Mar 2024 06:34 IST

దిల్లీ: అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్‌ ఎదిగేందుకు భారత్‌ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత్‌-భూటాన్‌ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ-తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత శనివారం వెలువడిన ఉమ్మడి ప్రకటన తెలిపింది. భూటాన్‌ 12వ పంచవర్ష ప్రణాళిక కోసం భారత్‌ రూ.5000 కోట్ల సాయం అందించింనందుకు తోబ్గా కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నైపుణ్యరంగాలు, మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పాడతాయని తోబ్గే అన్నారని నివేదిక వెల్లడించింది. ఇరుదేశాల మధ్య రైల్వే లైన్ల నిర్మాణంలో అభివృద్ధిని ప్రధానులు స్వాగతించినట్లు పేర్కొంది. 1020 మెగావాట్ల హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ‘పునత్‌షాంగ్చు-2’ పట్ల ఇరుదేశాలు సంతృప్తి వ్యక్తంచేసినట్లు నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని