రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే!

రష్యాలో విడతలవారీగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైలులోనే మరణించిన విషయం తెలిసిందే.

Published : 17 Mar 2024 06:23 IST

మాస్కో: రష్యాలో విడతలవారీగా జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుతిన్‌ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ ఇటీవల జైలులోనే మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఇతర ప్రత్యర్థులు సైతం ప్రవాసంలోనో, జైళ్లలోనో ఉన్నారు. రంగంలో మిగిలిన ముగ్గురు అభ్యర్థులు మిత్రపక్షాలకు చెందిన నామమాత్ర ప్రత్యర్థులే. ఈ నేపథ్యంలో 71 ఏళ్ల  పుతిన్‌ రష్యా అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. శుక్ర, శనివారాల్లో పోలింగ్‌ సజావుగానే సాగినా కొన్ని ప్రాంతాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. నావల్నీ మద్దతుదారులు పోలింగ్‌ కేంద్రాల్లో నిరసన తెలిపారు. అయితే.. ఎన్నికలను అడ్డుకోవాలని చూసేవారికి ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కొందరు శాసనకర్తలు ప్రతిపాదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని