కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ తాజా ప్రతిపాదన

రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్‌ తెలిపింది.

Published : 28 Apr 2024 06:12 IST

పరిశీలించి చెబుతామన్న హమాస్‌

కైరో/న్యూయార్క్‌: రఫాపై దాడికి ఇజ్రాయెల్‌ సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ తమకు ఓ ప్రతిపాదన పంపినట్లు హమాస్‌ తెలిపింది. దీన్ని తాము పరిశీలిస్తున్నామని, త్వరలోనే స్పందన తెలుపుతామని శనివారం పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనలోని అంశాలను మాత్రం హమాస్‌ సీనియర్‌ నేత ఖలీల్‌ అల్‌ హయ్యా వెల్లడించలేదు. ఈ నెల 13న ఈజిప్టులో జరిగిన చర్చల్లో 40 మంది ఇజ్రాయెలీ బందీల విడుదల, ఇందుకు ప్రతిగా వందలాది మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడిచే పెట్టే అంశం తెరపైకి వచ్చింది. తాజా ప్రతిపాదనలో బందీల సంఖ్య 33కి తగ్గిందన్న వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణ చర్చల్లో తొలి నుంచీ కీలక పాత్ర పోషిస్తున్న ఈజిప్టు బృందం ఇజ్రాయెల్‌కు చేరుకుంది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడికి వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రొఫెసర్లు కూడా సంఘీభావంగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శనలు నిర్వహించి ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ పరిపాలనా కార్యాలయాలను ఆక్రమించిన పారిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ స్టడీస్‌ విద్యార్థులు శాంతించారు. అధికారులతో చర్చల అనంతరం కార్యాలయాలను ఖాళీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని