ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి.

Published : 29 Apr 2024 05:44 IST

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే వయసు తనకు అడ్డంకి కాదని  బైడెన్‌ అంటున్నారు. శనివారం రాత్రి ఆయన తన ప్రత్యర్థి 77 ఏళ్ల ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్‌ను ఆరేళ్ల పిల్లాడిగా అభివర్ణించారు. ‘‘2024 ఎన్నికల సన్నాహకాలు జోరు మీద ఉన్నాయి. అవును వయసు కూడా ఒక అంశమే. నేను ఈ ఎన్నికల్లో ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్న పెద్ద మనిషిని’’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. శృంగారతార స్టార్మీ డేనియల్‌కు సంబంధించి ట్రంప్‌పై జరుగుతున్న విచారణపైనా సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ‘స్టార్మీ వెదర్‌’ (తుపాను)ను తన ప్రత్యర్థి ఎదుర్కొంటున్నారని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని