హూతీల దాడికి గురైన నౌకకు భారత్‌ అండ

ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్‌ నౌకకు అండగా నిలిచింది.

Updated : 29 Apr 2024 05:41 IST

రంగంలోకి ఐఎన్‌ఎస్‌ కోచి

దిల్లీ: ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్‌ నౌకకు అండగా నిలిచింది. దాడి సమాచారం అందగానే నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోచి స్పందించింది. ఆ నౌక దగ్గరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించింది. అందులోని 22 మంది భారతీయులు సహా 30 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ధ్రువీకరించింది. నౌక భద్రతా పరిస్థితినీ ఐఎన్‌ఎస్‌ కోచిలోని నిపుణుల బృందం అంచనా వేసింది. అనంతరం నౌక ప్రయాణానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది. రష్యాలోని ప్రిమోస్క్‌ నుంచి బయల్దేరిన ఈ ముడిచమురు నౌక భారత్‌లోని వాడినార్‌కు త్వరలో చేరనుంది. మరోవైపు హూతీల దాడిలో తమ ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్‌ కూలిందని అమెరికా అంగీకరించింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని సైన్యం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని