అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు

గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు.

Published : 29 Apr 2024 04:25 IST

న్యూయార్క్‌: గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. శనివారం కూడా వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాలస్తీనియన్లపై నరమేధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను యూనివర్సిటీలు తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. అరెస్టైన వారిలో గ్రీన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జిల్‌ స్టెయిన్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని