దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం

దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Published : 29 Apr 2024 04:26 IST

అయిదుగురి మృతి, పలువురికి గాయాలు

బీజింగ్‌: దక్షిణ చైనాలోని గ్వాంగ్‌ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు 100 ఇళ్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. బైయున్‌ జిల్లాలో మధ్యాహ్నం 3గంటలకు భారీ సుడిగాలి చెలరేగిందని చైనా వాతావరణ సంస్థ తెలిపింది. 141 ఫ్యాక్టరీ భవనాలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.


అమెరికాలోనూ..

ఇద్దరి మృతి.. భారీగా ఆస్తి నష్టం

హోల్డెన్‌విలె: అమెరికా ఒక్లహామాలోని సల్ఫర్‌, హోల్డెన్‌ విలెలో ఆదివారం టోర్నడోలు భారీ విధ్వంసం సృష్టించాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. భారీగాలులకు వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక్లహామాలోని 12 కౌంటీల్లో అధికారులు అత్యయిక స్థితి ప్రకటించారు. దాదాపు 33 వేల గృహాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఒమాహా, నెబ్రాస్కాలోనూ టోర్నడోలు భారీ నష్టాన్ని కలిగించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని