టిబెట్‌పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్‌కీ

టిబెట్‌ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్‌ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్‌కీ (24) తెలిపారు.

Published : 29 Apr 2024 05:36 IST

ధర్మశాల: టిబెట్‌ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్‌ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్‌కీ (24) తెలిపారు. 2015 అక్టోబరు 21న ఈ యువతి తన సోదరి టెన్జిన్‌ డోల్మాతో కలిసి టిబెట్‌లో ఓ ప్రదర్శన నిర్వహించగా, చైనా పోలీసులు ఇద్దరినీ నిర్బంధంలోకి తీసుకొని మూడేళ్లపాటు జైలులో ఉంచారు. టిబెట్‌ ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామా చిత్రాలను బహిరంగంగా ప్రదర్శించి, టిబెట్‌కు స్వేచ్ఛను కోరుకోవడమే నామ్‌కీ సోదరీమణులు చేసిన నేరం. చైనా జైలు నుంచి విడుదలయ్యాక గతేడాది జూన్‌లో నామ్‌కీ భారత్‌కు చేరుకున్నారు. పది రోజుల కాలినడకతో నేపాల్‌కు వచ్చిన ఈమె అక్కడి నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వచ్చారు. టిబెట్‌పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతానంటున్న నామ్‌కీ ధర్మశాలలో ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వం నడుపుతున్న ‘షేరబ్‌ గాట్సెల్‌ లింగ్‌’ విద్యాసంస్థలో చదువుకొంటున్నారు. మీడియా ప్రతినిధులతో నామ్‌కీ మాట్లాడుతూ..‘‘టిబెట్‌ గురించి చైనా ప్రభుత్వం ప్రపంచానికి చూపుతున్నది వాస్తవ పరిస్థితికి పూర్తిగా విరుద్ధం. మతస్వేచ్ఛను నిరాకరిస్తున్న చైనా టిబెట్‌ సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీయాని చూస్తోంది. ఈ విషయాలు ప్రపంచానికి తెలిసేలా టిబెట్‌ గొంతుకనవుతా’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని