Canada: కెనడాలోని హిందూ దేవాలయంలో ఖలిస్థానీల విధ్వంసం

కెనడాలో హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. కేటీఎఫ్‌ అధినేత చిత్రాలు ఉన్న పోస్టర్లను ఇక్కడ అంటించారు.  

Updated : 13 Aug 2023 10:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా (Canada)లో ఖలిస్థానీల ఆగడాలు పెరిగిపోయాయి. తాజాగా ఓ హిందూ దేవాలయంలో వారు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా(British Columbia)లో ఉన్న పురాతన లక్ష్మీనారాయణ ఆలయంలో చోటు చేసుకొంది. దాడి అనంతరం ఖలిస్థానీ రెఫరెండం పోస్టర్లను ఆలయంపై అంటించారు. వీటిపై ‘జూన్‌ 18 నాటి ఘటనలో భారత్‌ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది’ అని రాసి ఉంది. అంతేకాదు.. ఇటీవల మరణించిన ఖలిస్థానీ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ చిత్రాలు కూడా వీటిపై ఉన్నాయి. కెనడాలోని సుర్రేలో గురునానక్‌ సిక్కు గురుద్వారా సాహెబ్‌ వద్ద నిజ్జర్‌ను జూన్‌18న ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. సిక్కు వేర్పాటువాద సంస్థ ఖలిస్థానీ టైగర్‌ ఫోర్స్‌ (కేటీఎఫ్‌) చీఫ్‌గా నిజ్జర్‌ పనిచేశాడు.

‘ఆ హద్దులు...’ ప్రమాద పొద్దులు

కెనడాలో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న మూడో ఆలయ విధ్వంసం ఇది. జనవరి 31న బ్రాప్టన్‌లోని ఓ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అప్పట్లో భారత సంతతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులకు వ్యతిరేకంగా విద్వేషాలను రెచ్చగొట్టడాన్ని అక్కడి మేయర్‌ పాట్రిక్‌ బ్రౌన్‌ కూడా ఖండించారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఒంటారియోలో ఓ హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇక్కడి సీసీ టీవీ చిత్రాల ఆధారంగా విండ్‌సోర్‌ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. వీరు స్ప్రేపెయింటింగ్‌ను వాడి ఆలయ గోడలపై రాతలు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని