ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్‌ చేరువ..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి ఓ ‘ఉమ్మడి వ్యోమగామి మిషన్‌’ను భారత్‌- అమెరికాలు ప్రకటించనున్నట్లు సమాచారం. నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తోన్న వేళ దీనిపై ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Published : 22 Jun 2023 18:27 IST

వాషింగ్టన్‌: భారత అంతరిక్ష రంగం (Indian Space Industry)లో కీలక పరిణామం. ఇప్పటివరకు భారతీయ వ్యోమగామి (Indian Astronaut) అడుగుపెట్టని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మనకు చేరువకానుంది. 2024లో ఐఎస్‌ఎస్‌కు ఉమ్మడి మిషన్‌ (Joint Mission)ను భారత్- అమెరికాలు ప్రకటించనున్నట్లు వైట్‌హౌస్‌ (White House) వెల్లడించింది. నాసా (NASA), ఇస్రో (ISRO)ల నడుమ ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటిస్తున్న వేళ.. దీనిపై ఒక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు అంతరిక్ష అన్వేషణకు, ముఖ్యంగా జాబిల్లిపై ప్రయోగాలకు సంబంధించి అమెరికా రూపొందించిన ‘ఆర్టెమిస్‌ ఒప్పందం (Artemis Accords)’లో భాగం కావాలని భారత్‌ నిర్ణయించినట్లు వైట్‌హౌస్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని