Kim Jong Un: కిమ్‌ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!

ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.

Published : 03 May 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర కొరియాతోపాటు ఆ దేశ నియంత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un)కు సంబంధించి సంచలన విషయాలు అంతర్జాతీయ మీడియాలో తరచూ వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఊహించని విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనను ‘సంతోష పెట్టడానికి’ ఏటా 25 మంది యువతుల బృందం పనిచేస్తుందని తెలిసింది. రూపం, విధేయత ఆధారంగా వీరిని ఎంపిక చేసుకొని.. వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారని తెలిసింది. కిమ్‌ను ‘సంతోష పెట్టే’ (Pleasure Squad) బృందంగా పేర్కొనే ఈ పనికి గతంలో ఎంపికైన, ఉత్తర కొరియా (North Korea) నుంచి పారిపోయిన ఓ యువతి చెప్పిన విషయాలను ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

వైద్య పరీక్షలు చేసి..

‘యవ్వన దశలో ఉన్న అందమైన అమ్మాయిల కోసం కిమ్‌ ‘సన్నిహితులు’ దేశ వ్యాప్తంగా సందర్శిస్తారు. కొందరిని ఎంచుకున్న తర్వాత వారి కుటుంబ, రాజకీయ నేపథ్యం గురించి ఆరా తీస్తారు. ఉత్తర కొరియా నుంచి పారిపోయిన లేదా దక్షిణ కొరియా, ఇతర దేశాల్లో బంధువులు ఉన్న వారిని పక్కన పెడతారు. యువతులను ఎంపిక చేసుకున్న తర్వాత.. వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. చిన్న మచ్చ ఉన్నా అనర్హులుగా ప్రకటిస్తారు. అనంతరం వారిని ప్యాంగ్యాంగ్‌కు పంపిస్తారు. నియంతను అన్ని విధాలుగా సుఖ పెట్టడమే వారి పని’ అని పార్క్‌ అనే అమ్మాయి చెప్పినట్లు తాజా కథనం పేర్కొంది.

మూడు బృందాలుగా విభజించి..

ఈ బృందాన్ని మూడు విభాగాలుగా విభజిస్తారు. మసాజ్‌ చేయడానికి ఒక బృందం, పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడానికి మరో బృందానికి శిక్షణ ఇస్తారు. మూడో గ్రూపు మాత్రం లైంగిక కార్యకలాపాల కోసం. నియంతతో సన్నిహితంగా మెలగడమే వారి పని. పురుషులను ఎలా సంతోషపెట్టాలని నేర్చుకోవడమే వారి విధి. అత్యంత అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్‌ దగ్గరకు పంపిస్తారని సదరు యువతి చెప్పినట్లు తాజా కథనం పేర్కొంది. 20ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ బృందంలోనే ఉంచుకొని, ఆ తర్వాత కిమ్‌ అంగరక్షకులతో వారికి పెళ్లి చేస్తారని తెలిపింది.

ఈ బృందంలోకి పంపించేందుకు యువతుల కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారని సమాచారం. ఆకలితో తమ పిల్లలు అలమటించకుండా ఉండరనే అందుకు కారణమని తెలుస్తోంది. అయితే, కేవలం కిమ్‌ హయాంలోనే ఇది మొదలు కాలేదని.. 1970ల నుంచే ఇటువంటి బృందం అక్కడ పనిచేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని