UkraineCrisis: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా పట్టణంలో భారీ పేలుడు

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా నగరం బ్రయాన్స్క్‌లో సోమవారం తెల్లవారుజాము భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చమురు డిపో ఉంది. ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

Published : 25 Apr 2022 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యా నగరం బ్రయాన్స్క్‌లో సోమవారం తెల్లవారుజాము భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో చమురు డిపో ఉంది. ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. రష్యాలోని చమురు సరఫరా కంపెనీ ట్రాన్స్‌నెఫ్ట్‌కు సంబంధించిన పైప్‌లైన్లు కూడా అక్కడ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఉక్రెయిన్‌ వైపు నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఈ  పట్టణంలో సుమారు 4లక్షల మంది ప్రజలు ఉన్నారు. రష్యా అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ఉక్రెయిన్‌కు చెందిన కీవ్‌ పోస్ట్‌ పత్రిక మాత్రం రెండు చమురు డిపోలు దహనమవుతున్నాయని కథనంలో పేర్కొంది. 

ఉక్రెయిన్‌ సరిహద్దుకు ఈశాన్యంగా 154 కిలోమీటర్ల దూరంలో బ్రయాన్స్క్‌ నగరం ఉంది. ఈ నెల రెండోవారంలో ఉక్రెయిన్‌ హెలికాప్టర్లు పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశాయి. ఈ దాడుల్లో మొత్తం ఏడుగురు రష్యా పౌరులు గాయపడ్డారు. అదే సమయంలో బెల్‌గోర్డ్‌లో కూడా ఒక చమురు డిపోను ఉక్రెయిన్‌ హెలికాప్టర్లు పేల్చివేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని