Mayor marriage with crocodile: మొసలితో మేయర్‌ పెళ్లి.. ఎందుకో తెలుసా!

తమ ప్రాంతంలోని రెండు సమూహాల మధ్య శాంతి కొనసాగడానికి ఒక మేయర్‌ ఆడ మొసలిని వివాహం చేసుకున్నాడు. 

Updated : 02 Jul 2023 15:59 IST

మెక్సికో సిటీ: సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వర్షాల కోసం లేదా పంటలు బాగా పండటం కోసం ప్రార్థిస్తూ విభిన్న ఆచారాలు పాటిస్తారు. ఓ ప్రాంతంలో మాత్రం ప్రజలంతా కలిసి పట్టణ మేయర్‌ (mayor)కు వివాహం (marriage)జరిపించడం వారి సంప్రదాయం. ఆ వివాహం మహిళతో కాదండోయ్‌.. ఒక ఆడ మొసలి(crocodile)తో..! 

దక్షిణ మెక్సికో (southern Mexico)లోని  శాన్ పెడ్రో హువామెలులా (San Pedro Huamelula)అనే పట్టణంలోనిది ఈ సంప్రదాయం.  విక్టర్ హ్యూగో సోసా (Victor Hugo Sosa,) అనే మేయర్‌ చొంటల్, హువే అనే రెండు సమూహాల మధ్య శాంతిని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో అలీసియా అడ్రియానా అనే ఆడ మొసలిని వివాహం చేసుకున్నారు. 230 ఏళ్లుగా తమ పూర్వికుల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట. ఈ వివాహం తమ ప్రాంత ప్రజలకు మరింత అదృష్టాన్ని తెస్తుందని వారి నమ్మకం. ప్రజలు పెళ్లికుమారుడిని చొంటల్‌ రాజుగా.. మొసలిని రాణిగా భావిస్తారు.

అయితే.. ఈ వేడుకకు ముందు ప్రజలు మొసలిని తమ ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక నృత్యం చేస్తారు. అనంతరం మొసలిని పెళ్లి వస్త్రాలతో అలంకరిస్తారు. భద్రత కోసం దాని ముక్కుకు తాడును కడతారు. మత్స్యకారులు వలలతో నృత్యాల్లో పాల్గొంటారు. ఈ వేడుకను ఒక పెద్ద పండుగగా నిర్వహిస్తాం. వరుడు వధువు(మొసలి)ను ఎత్తుకుని నృత్యం చేసి దాని నుదుటిపై ముద్దు పెట్టడంతో వేడుక ముగుస్తుంది. ‘‘మేం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. నేను నా భార్య పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాను’’అని సోసా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని