Elon Musk: పిల్లలున్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలి..! మస్క్‌ వ్యాఖ్య

తక్కువ సంతానం కలిగి ఉంటే పర్యావరణానికి మంచిదనే వాదనను ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్‌ మస్క్‌(Elon Musk) కొట్టిపారేస్తుంటారు. సంతానం కలిగి ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలంటూ తాజాగా అభిప్రాయపడ్డారు. 

Published : 01 Nov 2023 13:04 IST

వాషింగ్టన్‌: అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌(Elon Musk) తోసిపుచ్చుతుంటారని తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఉండాలి. కొన్ని దేశాల్లో మాదిరిగా వారికి ఆర్థికంగా ప్రతికూలతలు ఉండకూడదు. మనం తప్పక తర్వాతి తరాన్ని సృష్టించాలి. లేకపోతే అస్థిత్వాన్ని కోల్పోయే స్థితిలోకి జారుకుంటాం’ అని మస్క్‌(Elon Musk) అన్నారు. హంగరీ అధ్యక్షురాలు కటాలిన్‌ నోవాక్ చేసిన పోస్టుకు ఆయన ఈ విధంగా స్పందించారు. ‘సంతానం లేనివారితో పోలిస్తే పిల్లలున్నవారికి ఆర్థికంగా ప్రతికూలతలు ఉండాలా..? హంగరీలో సంతానం ఉన్నవారు ఆర్థికంగా సానుకూలతలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ ఆమె ట్విటర్‌లో ఒక సర్వే నిర్వహించారు.

హమాస్‌ను సాగనంపి గాజాలో బహుళజాతి దళాలు.. అమెరికా-ఇజ్రాయెల్‌ వ్యూహం..!

ఇదివరకు అధిక జనాభా పర్యావరణానికి హానిచేస్తుందనే వాదనను తోసిపుచ్చుతూ.. ‘తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. జనాభా రెట్టింపైనా..పర్యావరణం బాగానే ఉంటుంది. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది. నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని