Watch: జుట్టుపట్టుకుని.. కిందపడి తన్నుకుని: లైవ్‌ డిబేట్‌లో నేతల కొట్లాట

Viral Video: పాకిస్థాన్‌లో ఇద్దరు నేతలు లైవ్‌ డిబేట్‌లోనే బాహాబాహీకి దిగారు. అందరూ చూస్తుండగానే జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

Updated : 29 Sep 2023 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బహిరంగ చర్చా వేదికల్లో ప్రత్యర్థి పార్టీల వ్యక్తులు పరస్పరం వాదులాడుకోవడం, నోరుపారేసుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. పాకిస్థాన్‌ (Pakistan)లో ఓ లైవ్‌ టీవీ డిబేట్‌ (Live TV Debate)లో అలా జరిగిన ఓ వాగ్వాదం కాస్తా శ్రుతి మించింది. నేతలు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం, కిందపడి తన్నుకోవడం దాకా వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. (Pak Leaders Fight)

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీకి చెందిన న్యాయమాది షేర్‌ అజ్వాల్‌ మార్వాత్‌.. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (PML-N) పార్టీ సెనెటర్‌ అఫ్ననుల్లా ఖాన్‌ ఇటీవల ఓ ప్రైవేట్‌ టీవీ ఛానల్‌ లైవ్‌ డిబేట్‌లో పాల్గొన్నారు. చర్చ సమయంలో వీరిద్దరూ పరస్పరం వాగ్వాదానికి దిగారు. అది కాస్తా తీవ్రంగా మారి ఘర్షణకు దారితీసింది.

బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి

పీటీఐ పార్టీకి వ్యతిరేకంగా సెనెటర్‌ ఖాన్‌ మాట్లాడుతుండగా.. ఆవేశానికి గురైన న్యాయవాది మార్వాత్‌ ఒక్కసారిగా లేచి ఆయనను కొట్టారు. దీంతో ఖాన్‌ కూడా ప్రతిదాడికి దిగారు. లైవ్‌ ప్రసారమవుతుండగానే ఇద్దరూ కిందపడి కొట్టుకున్నారు. దీంతో యాంకర్‌, ఛానల్‌లోని ఇతర సిబ్బంది వారిని విడిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనపై సెనెటర్‌ ఖాన్‌ స్పందిస్తూ.. తాను హింసకు వ్యతిరేకమని, కానీ పీటీఐ నేతలకు ఇలాంటి భాషలో చెబితేనే అర్థమవుతుందని దుయ్యబట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని