PM Modi: మోదీ పర్యటన భారత్‌-అమెరికా సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది

న్యూదిల్లీ-వాషింగ్టన్‌ బంధంలో కొత్త అధ్యాయం మొదలైందని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ పేర్కొన్నారు. ఇటీవల మోదీ అమెరికా పర్యటనపై కీలక ప్రకటన చేశారు.  

Published : 25 Jun 2023 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అధికారిక పర్యటన న్యూదిల్లీ-వాషింగ్టన్‌ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని భారత్‌(India)లో అమెరికా(USA) రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ అభివర్ణించారు. ఈ పర్యటన చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని దాటి స్వచ్ఛమైన స్నేహ బంధంతో ముడిపడిందని పేర్కొన్నారు. ఏళ్ల కొద్దీ ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో జరిగిన కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. చాలా మంది అంచనాలను మించి ఇరు దేశాల బంధం ముందడుగు వేసిందన్నారు. ఇది జోబైడెన్‌-మోదీ మధ్య స్నేహం, ఇరు దేశాల ప్రభుత్వం, ప్రజలు, వ్యాపార, సాంస్కృతిక సంబంధాలతో సాధ్యమైందని పేర్కొన్నారు. 

‘‘ఇదంతా భవిష్యత్తు కోసమే. రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉంటే ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు ఎలా పనిచేయవచ్చో భారత్‌, అమెరికా తెలియజేస్తాయి’’ అన్నారు. ఈ పర్యటనలో శాంతి, సుసంపన్నత, ధరిత్రి ప్రజలే కీలక అంశాలని వెల్లడించారు. అమెరికా వాణిజ్య విభేదాలను పక్కనపెట్టి.. ఎట్టకేలకు టెక్నాలజీ సహకారాన్ని, ప్రపంచ పంపిణీ వ్యవస్థల అంశాలను, పర్యావరణం, అంతరిక్షం, సముద్రాల్లో కలిసి పనిచేసేలా సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు. మార్చి 16 ఎరిక్‌ గార్సెట్టీ  భారత రాయబారిగా నియమితులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని