Ukraine-Russia: మిస్సైళ్లతో రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో 11 మంది మృతి

ఉక్రెయిన్‌ నగరంపై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, అందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. 

Updated : 07 Jan 2024 01:47 IST

కీవ్‌: ఉక్రెయిన్‌(Ukraine)లోని పోక్రోవ్స్క్‌ పట్టణంపై రష్యా(Russia) శనివారం మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 11 మంది సాధారణ ప్రజలు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉండగా, ఎనిమిది మంది గాయపడ్డట్లు ఉక్రెయిన్‌ నియంత్రణలోని డొనెట్స్క్‌ గవర్నర్‌ వెల్లడించారు. రష్యా తన ఎస్‌-300 మిస్సైళ్లతో దాడి చేసిందని, 6 భవనాలు నేలకూలయని డొనెట్స్క్‌ రిజినల్‌ హెడ్‌ తెలిపారు. సహాయ చర్యలకు సంబంధించి ఫొటోలను ఆయన విడుదల చేశారు. ఈ ఘటనపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఉక్రెయిన్‌పై జరిగే ప్రతి దాడికి రష్యా పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. సాధారణ ఇళ్లను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడిచేస్తోందన్నారు. రష్యా బలగాలు సాధ్యమైనంత వరకు తమ భూభాగాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయన్నారు. దాడి జరిగిన పొక్రోవ్స్క్‌ పట్టణం డొనెట్స్క్‌ రీజియన్‌లో ఉంది. ఇది రష్యా సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. యుద్ధం జరగడానికి ముందు ఇక్కడ 60,000 ప్రజలు నివసించేవారు. గత ఆగస్టులో రష్యా బాంబు దాడులతో ఈ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని