COP28: భూతాపాన్ని నియంత్రించడానికి ఇదే చివరి అవకాశం: అమెరికా

భూతాపాన్ని(global warming) నియంత్రించడానికి ఇదే చివరి అవకాశామని అమెరికా ప్రతినిధి జాన్‌ కెర్రీ ‘కాప్‌-28 (COP28)’ వాతావరణ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దుబాయి వేదికగా జరుగుతోన్న ఈ శిఖరాగ్ర సదస్సులో తాజాగా ఆయన మాట్లాడారు. 

Published : 12 Dec 2023 05:50 IST

దుబాయి: భూతాపాన్ని(global warming) నియంత్రించడానికి ఇదే చివరి అవకాశామని అమెరికా ప్రతినిధి జాన్‌ కెర్రీ ‘కాప్‌-28 (COP28)’ వాతావరణ సదస్సును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దుబాయి వేదికగా జరుగుతోన్న ఈ శిఖరాగ్ర సదస్సులో తాజాగా ఆయన మాట్లాడారు. కాప్‌ 28 అధ్యక్షుడు సుల్తాన్‌ అల్‌ జాబెర్‌ ప్రతిపాదించిన ముసాయిదాలో శిలాజ ఇంధనానికి దశలవారీగా స్వస్తి చెప్పాలని పేర్కొనకపోవడం అమెరికాను నిరూత్సహపర్చిందని తెలిపారు. ‘‘శిలాజఇంధనం స్వస్తికి ప్రతిజ్ఞ చేయాలని ప్రపంచానికి చెబుతున్నాం. కానీ, మనలో చాలా మంది ఆ ప్రతిజ్ఞను వ్యతిరేకించేవాళ్లున్నారు’’అని కెర్రీ అన్నారు. పారిస్‌ ఒప్పందం ప్రకారం భూతాపం పెరుగుదలను 1.5 సెల్సియస్‌ డిగ్రీల వద్ద స్థిరీకరించాలి. ఇందుకోసం 2030 నాటికి కర్బన ఉద్గారాలను 50 శాతం మేర తగ్గించాలి. తద్వారా భూతాపాన్ని నియంత్రించాలి. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఇదే మనకు చివరి అవకాశామని కెర్రీ తెలిపారు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో కాప్‌ 28 భాగస్వామ్య దేశాలు వైఫల్యం చెందవని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని