plane overshoots runway: రన్‌వే నుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం..!

అమెరికాకు చెందిన భారీ నిఘా విమానం రన్‌వే నుంచి అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హవాయిలో చోటు చేసుకొంది.

Updated : 21 Nov 2023 10:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం రన్‌వేపై అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆ కోర్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించడంతో.. ఆ విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

అక్కడే సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు ఈ విమానం నీటిపై తేలడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కొసరి కొసరి వడ్డించిన బైడెన్‌

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్‌ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సబ్‌మెరైన్లను గాలించి వాటిపై దాడి చేయగలదు. అంతేకాదు.. భారీగా ఇంటెలిజెన్స్‌ను కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను కూడా ఇది తీసుకెళ్లగలదు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో వెల్లడించలేదు. ఈ విమానాన్ని నిర్వహించే పెట్రోల్‌ స్క్వాడ్రన్‌ కనోహె బే కేంద్రంగా పనిచేస్తుంది. మెరైన్‌ కోర్‌ ప్రధాన స్థావరం కూడా హవాయిలోనే ఉంది. ఇక ప్రపంచంలో పీ8 విమానాలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బ్రిటన్‌, నార్వే, భారత్‌ సైన్యాలు కూడా వాడుతున్నాయి. 

2009లో అమెరికాలో ఓ భారీ విమానం హడ్సన్‌ నది మధ్యలో నీటిపై దిగింది. కానీ, పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో అప్పట్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని