Donald Trump: ట్రంప్‌ అధ్యక్ష బరిలో కొనసాగొచ్చు.. తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు

కొలరాడోలో జరిగే రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా డొనాల్డ్‌ ట్రంప్‌పై అనర్హత వేటు వేస్తూ గతేడాది స్థానిక కోర్టు తీర్పును అమెరికా సుప్రీం కోర్టు తాజాగా తోసిపుచ్చింది.

Published : 04 Mar 2024 23:30 IST

వాషింగ్టన్‌: అధ్యక్ష అభ్యర్థిత్వ ఎన్నికల్లో దూసుకెళ్తోన్న వేళ.. అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)నకు భారీ ఊరట. 2021లో యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడిని ట్రంప్‌ ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని పేర్కొంటూ.. కొలరాడోలో జరిగే రిపబ్లికన్‌ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా స్థానిక కోర్టు గతేడాది ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ తీర్పును అమెరికా సుప్రీం కోర్టు (US Supreme Court) తాజాగా తోసిపుచ్చింది. మంగళవారం 15 రాష్ట్రాల ప్రైమరీల్లో ఓటింగ్‌ (Super Tuesday) వేళ ఈ తీర్పు వచ్చింది.

ఎదురులేని ట్రంప్‌.. మిసోరి, మిషిగన్‌, ఐడహోల్లోనూ ఘనవిజయం

రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్‌ 3 నిబంధనను అమలు చేసే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని, రాష్ట్రాలకు కాదని అమెరికా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొలరాడో మాదిరే గతంలో మైన్‌, ఇలినోయ్‌ రాష్ట్రాలు కూడా ట్రంప్‌ విషయంలో ఇదేవిధమైన నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఈ తీర్పులు సుప్రీం కోర్టు నిర్ణయం కోసం వేచి ఉన్నాయి. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో.. ఆ రాష్ట్రాల ప్రైమరీ పోరులో ట్రంప్‌ పేరు చేర్చేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు.. అధ్యక్ష పదవి అభ్యర్థి రేసులో ట్రంప్‌ దూసుకెళ్తున్నారు. శనివారం మిసోరి, మిషిగన్‌, ఐడహో కాకస్‌ల్లోనూ ప్రత్యర్థి నిక్కీ హేలీపై ఘన విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని