Adani Group: అదానీపై కేసు వ్యవహారం.. వైట్‌హౌస్‌ స్పందన ఇదే..

Eenadu icon
By International News Team Updated : 22 Nov 2024 08:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

White House On Adani Issue | వాషింగ్టన్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదవడం సంచలనంగా మారింది. సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారని అదానీ (Gautam Adani) సహా 8 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది.

శ్వేతసౌధం (White House) మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ తన రోజువారీ మీడియా సమావేశంలో అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారం గురించి స్పందించారు. ‘‘అదానీపై కేసు నమోదైన విషయం మా దృష్టికి వచ్చింది. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇవ్వగలదు. భారత్‌-అమెరికా (India - US) మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉన్నాయి. అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకుంటున్నాం. మిగతా సమస్యల మాదిరిగానే ప్రస్తుత సంక్షోభాన్ని కూడా ఇరుదేశాలు అధిగమించగలవు. ఇరు దేశాల మధ్య బంధం బలమైన పునాదిపై నిలబడింది’’ అని కరీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్‌- అదానీల జుగల్‌బందీ ఎప్పుడు.. ఎక్కడ.. ఎందుకు.. ఎలా?

లంచాల (Bribe Allegations on Adani) సొమ్ము కోసం తప్పుడు సమాచారమిచ్చి అమెరికాలో నిధులు సేకరించారని.. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ అదానీతోపాటు సాగర్‌ అదానీ, వినీత్‌ ఎస్‌.జైన్, అజూర్‌ పవర్‌ సీఈఓ రంజిత్‌ గుప్తా ఈ లంచాల పథకానికి సూత్రధారులని పేర్కొంది. ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (ఎఫ్‌సీపీఏ) కింద వీరికి సహకరించిన మరో ఐదుగురిపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో గౌతమ్‌ అదానీతోపాటు సాగర్‌ అదానీపైనా బుధవారం అమెరికాలో అరెస్ట్‌ వారంట్లు జారీ అయినట్లు కొన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా వీరంతా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ‘ఉన్నతస్థాయి’ వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు నివేదికలో ఆరోపణలున్నాయి.

Tags :
Published : 22 Nov 2024 08:35 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు