Elon Musk: ఉగ్ర ముఠాలకూ ఎక్స్‌ బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌..!

ఎక్స్‌ సబ్‌స్క్రప్షన్‌ విధానంలో ఉగ్ర ముఠాలు కూడా బ్లూటిక్‌ను పొందాయని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొంది. 

Published : 15 Feb 2024 12:20 IST

ఇంటర్నెట్‌డెస్క్: సోషల్‌ మీడియా దిగ్గజం ఎక్స్‌ (X) ప్రవేశపెట్టిన పెయిడ్‌ సబ్‌స్క్రప్షన్‌లో ఉగ్రముఠాలకు బ్లూటిక్‌ ఇచ్చినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ది టెక్‌ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్టు (టీటీపీ) అనే సంస్థ ఈ విషయాలను వెలుగులోకి తెచ్చింది. అమెరికా భూభాగంపై కార్యకలాపాలను నిర్వహించడంపై నిషేధం ఎదుర్కొంటున్న హెజ్‌బొల్లా వంటి సంస్థలు కూడా వీటిల్లో ఉన్నట్లు వెల్లడించింది. నెలకు 8 డాలర్లను చెల్లిస్తే బ్లూటిక్‌ లభిస్తుంది.. దీంతోపాటు సుదీర్ఘ పోస్టు పెట్టడానికి, మెరుగైన ప్రమోషన్‌కు ఇది ఉపయోగపడుతుంది.  

ట్విటర్‌ను కొనుగోలు చేశాక బ్లూటిక్‌ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది  మస్క్‌ (Elon Musk) తీసుకొన్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయం. ఇలా చేస్తే తప్పుడు సమాచార వ్యాప్తి తీవ్రతరమవుతుందని చాలా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

గతంలో ఈ బ్లూటిక్‌ను ట్విటర్‌ ఉచితంగా కేటాయించేది. దీనిని పొందే వ్యక్తుల వివరాలను సదరు సంస్థ ధ్రువీకరించుకొనేది. బ్లూటిక్‌ను పొందేవారిలో అత్యధికంగా జర్నలిస్టులు, ప్రపంచ నేతలు, ఇతర సెలబ్రిటీలే ఉండేవారు. ఆ తర్వాత ఎక్స్‌ తీసుకొన్న నిర్ణయంతో సరికొత్త న్యాయ సమస్యలు ఎదురవ్వడం మొదలయ్యాయని టీటీపీ సంస్థ పేర్కొంది. 

ట్రంప్‌ కంటే బైడెన్‌ బెటర్‌.. ఎందుకో చెప్పిన పుతిన్‌!

అయితే ఈ నివేదిక వెలువడిన తర్వాత కొన్ని సంస్థల బ్లూటిక్స్‌ను ఎక్స్‌ తొలగించింది. తమ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంది. అన్సార్‌ అల్లా (హూతీలు) సంస్థ బ్లూటిక్‌ అదృశ్యమైంది. దీనిని 23,000 మంది అనుసరిస్తున్నారు. ఈ సంస్థపై అమెరికా, యూకేలో ఆంక్షలున్నాయి.  అయితే ఇంకా చాల సంస్థల బ్లూటిక్‌లు కొనసాగుతున్నయని టీటీపీ పేర్కొంది. తన సామాజిక మాధ్యంపై ఎక్స్‌ నియంత్రణ కోల్పోయిందని ఆ సంస్థ సంస్థ డైరెక్టర్‌ కేటీ పాల్‌ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని