Houthi Rebels: మరోసారి రెచ్చిపోయిన హౌతీ రెబెల్స్‌.. యూఎస్‌ నౌకపై క్షిపణులతో దాడి

అమెరికాకు చెందిన కంటెయినర్‌ షిప్‌పై హౌతీ రెబెల్స్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేశారు. 

Updated : 16 Jan 2024 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హౌతీ రెబెల్స్‌ (Houthi Rebels) మరోసారి రెచ్చిపోయారు. యెమెన్‌ (Yemen) తీరంలో అమెరికా (US)కు చెందిన కంటెయినర్‌ షిప్‌ జిబ్రాల్టర్‌ ఈగల్‌పై యాంటి షిప్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేశారు. దీంతో షిప్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి ప్రమాదం గానీ, షిప్‌కు తీవ్రమైన నష్టంగానీ వాటిల్లలేదని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో మార్షల్‌ ఐలాండ్‌ జెండాతో కంటెయినర్‌ షిప్‌ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు అమెరికా ఆర్మీ తెలిపింది. తామే దాడిచేసినట్లు యెమెన్‌ రెబల్‌ గ్రూప్‌ ప్రకటించుకుంది. ‘‘మా దేశంపై దాడికి దిగిన అమెరికా, బ్రిటిష్‌కు చెందిన యుద్ధనౌకలను మేము శత్రులక్ష్యాలుగా భావిస్తాం’’ అని హౌతీ తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్య సరీ పేర్కొన్నారు. 

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా, బ్రిటన్‌ వరుసగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ హౌతీ రెబెల్స్‌ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా గత కొన్నిరోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న సంగతి తెలిసిందే.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని