YSRCP: కుమార్తె గెలుపు కోసం డిప్యూటీ సీఎం బండి నారాయణస్వామి పాట్లు

ఏపీ డిప్యూటీ సీఎం బండి నారాయణస్వామి.. ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, వారసురాలిని బరిలోకి దించారు. కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్న మేనల్లుడు.. ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు.

Published : 28 Apr 2024 14:32 IST

50 ఏళ్ల రాజకీయ జీవితం. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే. ఐదేళ్లు ఉపముఖ్యమంత్రి. చెప్పుకోవడానికి ఇన్ని గొప్పలు ఉన్న నారాయణస్వామి.. ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, వారసురాలిని బరిలోకి దించారు. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశానికి తోడు కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్న మేనల్లుడు.. ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. ఎలాగైనా మేనమామను దెబ్బకొట్టాలనే పట్టుదలతో జోరుగా జనంలోకి వెళుతుండటంతో.. కుమార్తె ఓటమి తప్పదని నారాయణస్వామి ఆందోళన చెందుతున్నారు.

Tags :

మరిన్ని