TDP: డబ్బు, రౌడీయిజంతో గెలిచేందుకు గోపిరెడ్డి ప్రయత్నం!: చదలవాడ అమూల్య భావోద్వేగం

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్లుగా తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.

Published : 28 Apr 2024 19:08 IST

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్నాడు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు కుమార్తె అమూల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఐదేళ్లుగా తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘ ప్రజల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అరవింద్‌బాబు నిలబడ్డారు. ఆర్థికంగా మా కుటుంబం ఎంతో నష్టపోయింది. నాకు, మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఎన్నికల్లో డబ్బు, రౌడీయిజాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలంతా కలిసికట్టుగా రౌడీయిజాన్ని అడ్డుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని