Nandyala: నంద్యాల వైకాపాలో వర్గ విభేదాలు

నంద్యాల వైకాపాలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోతో గొడవలు బయటపడ్డాయి. అసభ్య పదజాలంతో ఉన్న ఆ వీడియోపై నంద్యాల జెట్పీటీసీ సభ్యుడు గోకుల్  కృష్ణా రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ యాత్ర నిర్వహించినందుకే తనను టార్గెట్  చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 03 Feb 2024 11:58 IST

Tags :

మరిన్ని