భారీ బైకు ఇంజిన్‌ తయారు చేసిన హార్లీ

తాజావార్తలు


భారీ బైకు ఇంజిన్‌ తయారు చేసిన హార్లీ
ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బైకుల తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్‌ దాదాపు 15ఏళ్ల తర్వాత 11,870సీసీతో పనిచేసే ఓ భారీ ఇంజిన్‌ను తయారు చేసింది. 2017 రేంజి బైకుల కోసం దీనిని సిద్ధం చేసింది. దీనిని మిల్వాకీ -8 ఇంజిన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది హార్లీ తొమ్మిదో తరం ఇంజిన్‌గా చెప్పుకోవచ్చు. గతంలో 1999లో ఓ భారీ ఇంజిన్‌ను తయారు చేసింది. ప్రస్తుతం తయారు చేసిన మిల్వాకీ ట్విన్‌ ఇంజిన్‌ మరింత శక్తివంతమైంది. వేగవంతమైన థ్రోటల్‌ స్పందన దీని సొంతం. అత్యంత సమర్థవంతమైన కూలింగ్‌ వ్యవస్థ దీనికి ఉంది. ఈ విషయాన్ని హారీ స్టైలింగ్‌ - ప్రొడెక్ట్‌ డెవలప్‌మెంట్‌ స్ట్రాటజీ వైస్‌ప్రెసిడెంట్‌ స్కాట్‌ మిల్లర్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల కోరిక మేరకు ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది హార్లీడేవిడ్సన్‌ చరిత్రలో కొత్త అధ్యయానికి తెరతీస్తుందని భావిస్తున్నామన్నారు. కొత్త ఇంజిన్‌ 1745సీసీ (107) , 11,870 సీసీలతో లభిస్తుంది.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు
Property Handling 300x50

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.