icon icon icon
icon icon icon

tirupati: పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత

తిరుపతి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.

Updated : 15 May 2024 22:56 IST

తిరుపతి: తిరుపతి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. గృహ నిర్బంధంలో ఉండాలన్న పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన తనయుడు మోహిత్‌రెడ్డి  స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరినీ పోలీసులు తిరుపతి రూరల్ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. చెవిరెడ్డి పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారు దిగకుండా అందులోనే కూర్చున్నారు. వైకాపా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కాసేపటి తర్వాత మోహిత్‌రెడ్డిని పోలీసులు వెనక్కి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img