తాజా వార్తలు

Facebook Share Twitter Share Comments Telegram Share
December Smartphones: అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్‌! 

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ ప్రియులను అలరించేందుకు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తుంటాయి. ఇప్పటి వరకు అదిరే ఫీచర్లతో ఎన్నో రకాల కొత్త మోడల్స్‌ విడుదలయ్యాయి. వీటిలో 5జీ, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ అంటూ వేర్వేరు మోడల్స్‌ ఉన్నాయి. అయితే గత కొద్ది నెలలుగా  కరోనా పరిస్థితుల కారణంగా కొన్ని ఫోన్ల విడుదల చేయడం ఆలస్యమైంది. దీంతో వాయిదా పడిన ఫోన్లను డిసెంబర్‌ నెలలో విడుదల చేసి 2021కు ఘనమైన ముగింపు పలకాలని మొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంతో డిసెంబరు నెలలో మొబైల్ కంపెనీలు విడుదల చేయనున్న కొత్త మోడల్స్‌ జాబితాపై ఓ లుక్కేయండి మరి!


రెడ్‌మీ నోట్‌ 11టీ 5జీ (Redmi Note 11T 5G)

ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ ఇస్తున్నారట. 90 హెర్జ్‌ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుదని తెలుస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ డ్యూయల్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇదే సిరీస్‌లో రెడ్‌మీ నోట్‌ 11 ప్రో+ మోడల్‌ను కూడా తీసుకురానుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌ ఉపయోగించారు. ఈ ఫోన్లకు సంబంధించి ధర, ఇతర ఫీచర్లు వంటి వివరాలు తెలియాల్సి ఉంది. దీంతోపాటు కే సిరీస్‌లో కూడా కొత్త మోడల్‌ ఫోన్‌ను రెడ్‌మీ తీసుకురానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేశారు. కే20లో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ ఉపయోగించారు. గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేక ఫీచర్స్‌ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో రెడ్‌మీ కే20 పనిచేస్తుంది. 12జీబీ/256జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్‌ లభిస్తుందని సమాచారం.  


షావోమి 11ఐ (Xiaomi 11i)

షావోమి 11 సిరీస్‌లో రెండు మోడల్స్‌ పరిచయం చేయనుంది. షావోమి 11 ఐ, 11ఐ హైపర్‌ఛార్జ్‌ పేరుతో వీటిని తీసురానుంది. డిసెంబర్‌ చివరి వారం లేదా వచ్చే ఏడాదిలో జనవరి మొదటి వారంలో వీటిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. హైపర్ ఛార్జ్ మోడల్‌ను 120 వాట్ లేదా 100 వాట్ ఛార్జింగ్ సామర్థ్యంతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అలానే త్వరలో జరగనున్న క్వాల్‌కోమ్‌ టెక్‌ సమ్మిట్‌లో కూడా షావోమి 12 అల్ట్రా ఫోన్‌పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో స్నాప్‌డ్రాగన్‌ ఎనిమిదో జనరేషన్‌ వన్‌ ఏ ప్రాసెసర్‌ను క్వాల్‌కోమ్‌ విడుదల చేయనుంది. ఇదే ప్రాసెసర్‌ను షావోమి 12 అల్ట్రా ఫోన్‌లో కూడా ఉపయోగించినట్లు సమాచారం. 


పొకో ఎమ్‌4 ప్రో (Poco M4 Pro)

పోకో ఎమ్‌ సిరీస్‌లో 5జీ మోడల్‌ను విడుదల చేయనుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌/128 జీబీ  వేరియంట్లలో ఈ ఫోన్లు లభించనున్నాయి. వెనుకవైపు క్వాడ్‌ కెమెరాతో పాటు, ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఇస్తున్నారు. 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది . ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 15,990 నుంచి ఉండొచ్చని సమాచారం. 


మోటో జీ సిరీస్‌ (Moto G Series)

మోటో డిసెంబర్‌ నెలలో రెండు కొత్త మోడల్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. వాటిలో ఒకటి 5జీ మోడల్‌. మోటో జీ200 5జీ, మోటో జీ71 పేరుతో వీటిని తీసుకొస్తుంది. మోటో జీ200 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888+ 5జీ ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందులో 144 హెర్జ్ ఐపీఎస్‌ ఓఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా అమర్చినట్లు సమాచారం. ఇక మోటో జీ71లో స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ ఉపయోగించారట. ఇందులో కూడా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వీటిని డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదల చేయనున్నారు. 


శాంసంగ్‌ గెలాక్సీ ఏ13 5జీ (Samsung Galaxy A13 5G)

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటి 700 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌ యూఐ 3.1 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలుంటాయి. ముందు 8ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/128 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఉంటుందని అంచనా.  


ఇన్ఫీనిక్స్ నోట్ 11 (Infinix Note 11)

ఇందులో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.95-అంగుళాల అల్ట్రా ఫ్లూయిడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. గేమర్స్‌ కోసం ప్రత్యేకంగా మాన్‌స్టర్‌ గేమ్‌ కిట్ ఉంది. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 


వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ (OnePlus 9 RT) & వన్‌ప్లస్‌ నార్డ్‌ ఎన్‌20 (OnePlus Nord N20)

వన్‌ప్లస్‌ కూడా రెండు కొత్త మోడల్స్‌ను డిసెంబర్‌ నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ, వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌20 పేరుతో ఈ కొత్త మోడల్స్‌ను పరిచయం చేయనుంది. వన్‌ప్లస్‌ 9 ఆర్‌టీ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు సమాచారం. వెనుకవైపున 50 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా, 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఉండనుంది. ఈఫోన్‌లో 7జీబీ వర్చువల్‌ ర్యామ్‌ ఇస్తున్నారట. ఇక వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌20 మోడల్‌ను బడ్జెట్ శ్రేణిలో విడుదల చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఫోన్ ధర రూ. 15 వేల నుంచి రూ. 20 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్‌ రెండు లేదా మూడో వారంలో విడుదల కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.


ఐక్యూ 8 సిరీస్‌ (iQOO 8 Series)

ఐక్యూ 8 సిరీస్‌లో రెండు మోడల్స్‌ను విడుదల చేయనుంది. ఐక్యూ 8 లేదా ఐక్యూ 8 లెజెండ్ పేరుతో డిసెంబర్‌ చివరి వారంలో ఈ ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకొస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 888+ ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 120 హెర్జ్‌ రిజల్యూషన్‌తో 6.76 అంగుళాల 2K+డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,350 ఎంఏహెచ్‌ బ్యాటరీ వినియోగించారు. వీటి ధర రూ. 30 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.


రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్‌ (Realme Narzo 50A Prime) & రియల్‌మీ సీ35 (Realme C35)

రియల్‌మీ రెండు కొత్త మోడల్స్‌ను డిసెంబర్‌ చివరి వారంలో విడుదల చేయనుంది. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్‌, రియల్‌మీ సీ35 పేరుతో వీటిని తీసుకొస్తుంది. నార్జో 50ఏ ప్రైమ్‌ మోడల్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్ ఉపయోగించారని సమాచారం. 4జీబీ ర్యామ్/64 జీబీ అంతర్గత మెమొరీ, 4జీబీ/128జీబీ  వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుందట. ఈ ఫోన్‌లో వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,499 ఉంటుందని సమాచారం. రియల్‌మీ సీ35కి సబంధించిన ధర, ఫీచర్లు వంటి వివరాలు తెలియాల్సివుంది. 


ఒప్పో రెనో 7 సిరీస్‌ (Oppo Reno 7 Series) 

ఒప్పో రెనో 7 సిరీస్‌లో మూడు మోడల్స్‌ను తీసుకురానుంది. ఒప్పో రెనో 7, రెనో 7 ప్రో, రెనో 7 ఎస్‌ఈ. ఇప్పటికే ఒప్పో ఈ మోడల్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ఇవి 8 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 778జీ, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్లను ఉపయోగించారు. 90 హెర్జ్‌, 180 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్లతో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 60 వాట్, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 12 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. డిసెంబర్‌ చివరి వారంలో వీటిని భాతర మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఇవే కాకుండా ఒప్పో, వివో కంపెనీలు మడత ఫోన్లను (ఫోల్డింగ్ ఫోన్లు) అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేస్తారా? లేదా? అనే దానిపై పూర్తి సమాచారం లేదు. 


Note: గత నెలలో కూడా కొన్ని ఫోన్లు విడుదలవుతాయని భావించినప్పటికీ వేర్వేరు కారణాలతో వాటి విడుదల వాయిదా పడింది. డిసెంబరు నెలలో ఈ పరిణామం ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. పైన పేర్కొన్న జాబితాలోవి కాకుండా మరికొన్ని మొబైల్స్‌ డిసెంబరులో మార్కెట్‌లోకి రావొచ్చు. అలానే పైఫోన్లలోని స్పెసిఫికేషన్స్‌, ధరల్లో మార్పులు ఉండొచ్చు.


Read latest Gadgets & Technology News and Telugu News


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.