బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు కేటాయించాలి

కేంద్ర మంత్రికి బీసీ సంఘం వినతి

ఈనాడు, దిలీ: బీసీల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య కోరారు. దిల్లీలో గురువారం ఆయన కేంద్ర మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు. ‘‘మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 30 ఏళ్లుగా రిజర్వేషన్లు అమలవుతున్నా ఉపకార వేతనాలు ఇవ్వడం లేదు.స్వయం ఉపాధి పథకాల కోసం ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలి’’ అని కోరారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, మోక్షిత్‌ ఉన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని