close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
ఆమెత్తుపుస్తకాలు!

పెళ్లంటే... నగలు, చీరలు, ఖరీదైన కట్నకానుకలే గుర్తుకొస్తాయి.. కానీ ఈ వధువు అడిగిన కానుక పూర్తిగా భిన్నం. ఆ కానుకని తెచ్చిపెట్టడం కోసం ఆ తండ్రి పడ్డ కష్టమూ తక్కువేం కాదు. ఇంతకీ ఏంటా కానుక..

గుజరాత్‌కు చెందిన హర్‌దేవ్‌ సింగ్‌ జడేజా ఉపాధ్యాయుడు. ఆయన కూతురు కిన్నరా బాకు ఈమధ్యే వడోదరకు చెందిన పూర్విజిత్‌ సింగ్‌తో పెళ్లి కుదిరింది. అబ్బాయి కెనడాలో స్థిరపడ్డాడు. ‘అత్తారింటికి నీతో పాటు ఏం తీసుకెళ్తావ్‌ అమ్మా’ అని అడిగిన తండ్రి ప్రశ్నకు సమాధానంగా నా ఎత్తు పుస్తకాలు కావాలని అడిగింది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఇప్పటికే కిన్నరా దగ్గర అయిదు వందల పుస్తకాలతో ఓ చిన్న గ్రంథాలయమే ఉంది. దాంతో ఆ తండ్రి అమూల్యమైన పుస్తకాల జాబితాను తయారుచేసుకున్నారు. ఆరునెలలుగా పుస్తకాల కోసం దిల్లీ, వారణాసి, బెంగళూరుతోపాటు ప్రముఖ నగరాల్లో అన్వేషణ ప్రారంభించారు. వేద వ్యాసుడి దగ్గరి నుంచి ఆధునిక రచయితల రచనల వరకు సేకరించారు. ఇవి ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతీ భాషల్లో ఉన్నాయి. వీటిలో ఖురాన్‌, బైబిల్‌ సహా అష్టాదశ పురాణాలు కూడా ఉండటం విశేషం. 2,200 పుస్తకాలతో అమ్మాయిని అత్తారింటికి పంపానని ఆనందంగా చెబుతున్నారా తండ్రి.


మరిన్ని