close

తాజా వార్తలు

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల నిషేధం పొడిగించింది. ఏప్రిల్‌ 14 వరకు అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతి ఉన్న  విమానాలు, సరకు రవాణా విమానాలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ విమనాలపై నిషేధానికి సంబంధించి ఈ నెల 19న ఇచ్చిన ఉత్తర్వులకు కొనసాగింపుగా మరోసారి ఉత్తర్వులు వెలువరించింది.

ఇప్పటికే దేశీయ విమానాలను ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు రైళ్లు, మెట్రో సేవలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సైతం నిలిపివేశారు. కొవిడ్‌-19 నియంత్రణలో 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అప్పటి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించడం గమనార్హం. దేశీయ విమానాలు, మెట్రో సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల రద్దు సైతం పొడిగించే అవకాశం ఉంది. ఏప్రిల్‌ 14 వరకు హైదరాబాద్‌ మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు